బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. తల్లి కూతురు మృతి

mother-and-daughter-dead-in-current-shock-in-balapur

కరెంట్ షాక్ తో తల్లి, కూతురు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ పోలిస్టేషన్ పరిదిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా. షాహిన్ నగర్ లో చాన్ పాషా, అతని భార్య సల్మా వారి నలుగురి పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం పొద్దున చాన్ పాషా కూలీ పనికి వెళ్లాడు. ఆ తర్వాత.. సల్మా ఉతికిన బట్టలను ఇనుప వైర్ పై ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు ప్రవహించింది. దీంతో సల్మాతో పాటు ఆమె కూతురు సానియా కూడా మృతి చెందింది.

మరో ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అవడంతో స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కు తరలించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి బాధిత కటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలాపూర్ సీఐ సైదులు తెలిపారు.

Latest Updates