పాతబస్తీలో తల్లీ కూతుళ్ల మర్డర్

హైదరాబాద్  చాంద్రాయణగుట్ట లో దారుణం జరిగింది. తల్లి, కూతుళ్లను రెహమాన్ అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. మృతులు ఘజీమిల్లత్ నల్లవాగు ప్రాంతానికి చెందినవారు. స్థానికుల  సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మొహమ్మద్ హుసేన్,  షాజాది బేగం దంపతులు తమ కుటుంబంతో కలిసి ఘజీమిల్లత్ నల్లవాగు ప్రాంతంలో నివసిస్తున్నారు. శుక్రవారం పొద్దున 8గంటలకు హుసేన్ హోటల్ కు వెళ్లగా… వీరి ఇద్దరు కూతుర్లు స్కూల్ కు వెళ్లారు. ఇంట్లో తల్లి షాజాదీ బేగం, ఆమె మరో కూతురు ఫరీదా బేగం ఉన్నారు. ఆ సమయంలో రెహమాన్  అనే వ్యక్తి వచ్చి తల్లీ కూతుళ్లను చంపినట్టుగా పోలీసులు తెలిపారు.

Latest Updates