తల్లీపిల్లల సజీవదహనం.. నిద్రలోనే ఏడుగురు మృతి

అమెరికాలోని మిస్సిసిపీలో ఉంటున్న ఒక కుటుంబాన్ని అగ్నిప్రమాదం బలితీసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో తల్లి, ఆమె దగ్గర నిద్రపోతున్న ఆరుగురు పిల్లలు సజీవదహనమయ్యారు. అదృష్టవశాత్తు తండ్రి దెబ్బలతో బయపటడ్డాడు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ మిస్సిసీపీలోని క్లింటన్‌‌‌‌‌‌‌‌ సిటీలో బ్రిటానీ ప్రెస్లీ, భర్త, ఆరుగురు పిల్లలతో కలిసి నివాసముంటోంది. శుక్రవారం అర్ధరాత్రి వాళ్లంతా ఇంట్లో నిద్రపోతున్న టైంలో ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుంది. నిద్రలో ఉన్న వాళ్లు దాన్ని గమనించలేకపోవడంతో బ్రిటానీ ప్రెస్లీ, ఆమె ఆరుగురు పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. ఆమె భర్త తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. తీవ్రమైన పొగ వల్ల అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో మిగిలిన వారిని కాపాడలేకపోయారని అధికారి మార్క్‌‌‌‌‌‌‌‌ జోన్స్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. కాలిన గాయాలు కావడంతో అతడిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

అగ్నిప్రమాదానికి గురైన ఇళ్లు 1951లో నిర్మించారని, స్మోక్‌‌‌‌‌‌‌‌ డిటెక్టర్లు ఉన్నాయా లేదా అనే విషయంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదం ధాటికి చెక్క ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బొమ్మలు, బట్టలు అన్ని చెల్లాచెదరుగా పడిపోయాయి. ఇంటికి ఉన్న కిటికీలు వంగి ఉన్నాయని, ప్రమాదాన్ని గుర్తించిన బాధితులు తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బ్రిటానీ ప్రెస్లీ స్కూల్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని, చాలా ఫ్రెండ్లీ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని, ఆమె చనిపోవడం బాధ కలిగించిందని స్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌, యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

see more news

92వ ఆస్కార్ విన్నర్స్ వీరే…

కొత్త రూల్.. స్టూడెంట్ ఫెయిలైతే సబ్జెక్ట్​ టీచర్‍దే బాధ్యత

 

Latest Updates