ఇద్దరు ఆడబిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య…

ఆంధ్రప్రదేశ్: ఇద్దరు ఆడబిడ్డలతో సహా ఓ మహిళ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో జరిగింది. అనంతపూర్ పాపంపేట ప్రాంతానికి చెందిన వెంకటేశ్, పోలేరమ్మలు(45) భార్యా భర్తలు. వీరు కూలీ పనిచేసుకుని బతుకుతున్నారు. ఈ ఆలూమగలకు ఆర్తి(17), దీప(11)అనే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. పెద్ద బిడ్డె ఆర్తి ఇంటర్మీడియట్ పూర్తిచేసి నర్సింగ్ కోర్సులో ట్రేనింగ్ పొందుతుంది. కొన్ని ఆర్థిక కారణాలవల్ల… పోలేరమ్మ తన నగలను తాకట్టు పెట్టింది. ఈ నగల విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ కొట్లాడారు. దీంతో పోలేరమ్మ తన ఇద్దరు ఆడబిడ్డలను తీసుకుని ఇంట్లోంచి శనివారం రాత్రి వెళ్లిపోయింది. టెన్సన్ పడ్డ కుటుంబసభ్యులు వారి కోసం తీవ్రంగా గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం పొద్దున రైలు పట్టాల దగ్గర విగతజీవులుగా పడిఉన్నారని సమాచారం అందడంతో కన్నీరుమున్నీరయ్యారు కుటుంబసభ్యులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates