తల్లీ, బిడ్డలను పెట్రోల్ పోసి కాల్చేశారు

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను.. ఏడాది వయసు కుమార్తెను చంపి మృతదేహాలను పెట్రోల్‌ పోసి కాల్చివేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

పాతికేళ్ల వయసున్న మహిళ, ఏడాది వయసున్న ఆడబిడ్డను మద్దిపాడు మండలం పేర్నమిట్ట- లింగంగుంట గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తల్లీ బిడ్డలను హత్యచేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. రెండేళ్ల చిన్నారిని సైతం కాల్చేయడం చాలా దారుణం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ తలపై బండరాయితో మోదీ, చిన్నారి గొంతు కోసి.. తగులబెట్టారని పోలీసులు చెబుతున్నారు. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.

More News

లవ్ మ్యారెజ్ చేసుకున్న 20 రోజులకే మృతి
బీటెక్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో మరో మలుపు

Latest Updates