మేడ్చల్ లో విషాదం.. తల్లీబిడ్డల ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో విషాదం జరిగింది. 13 నెలల బిడ్డతో కలిసి ఇంటి సంపులో ఓ తల్లి ఆత్మహత్యసుకుంది.  మెదక్ జిల్లా దౌల్తాబాద్ కు చెందిన మల్లేష్ మొదటి తన మొదటి భార్యకు పిల్లలు కాకపోవడంతో ఆరేళ్ల క్రితం  లావణ్య అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని కుత్బుల్లాపూర్ లో ఉంటున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు .  భార్యభర్తలిద్దరి మధ్య  కొన్ని రోజుల నుంచి తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఒకరోజు లావణ్య తన కొడుకుతో కలిసి ఇంట్లో ఉండే సంపూలోకి దిగి ఆత్మహత్య  చేసుకుంది. తెల్లవారు జామున కుటుంబ సభ్యులు సంపూలో ఉన్న వారి మృతదేహాలను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates