కొడుకు సూసైడ్.. తట్టుకోలేక తల్లి కూడా..

Mother commits suicide because of her son's suicide

సికింద్రాబాద్/అల్వాల్, వెలుగు: కొడుకు సూసైడ్‌ చేసుకోగా, మనస్తాపంతో తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పీఎస్‌ ఎస్ ఐ సుదర్శన్ వివరాల ప్రకారం.. భరత్ నగర్ కాలనీ టెంపుల్ అల్వాల్ కు చెందిన చిన్న ఏకాంబరం భార్య దివ్య శ్రీ(37), ఆదివారం రాత్రి ఇంట్లోఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుం ది. గతేడాది కొడుకు టెన్త్‌ పరీక్షలు సరిగా రాయలేదని సూసైడ్‌ చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి అతని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తట్టు కోలేకపోయిన ఆమె మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిం ది. కుటుంబీకులు కంప్లయింట్‌ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలికి ఇద్దరు ట్విన్స్ (మగపిల్లలు). గత నెల 24న చనిపోయిన కొడుకు బర్త్ డే కూడా జరిపారు.

Latest Updates