చిన్నారితో కలిసి తల్లి సూసైడ్

అపార్ట్ మెంట్ పై నుంచి దూకడంతో ఇద్దరూ మృతి
రామంతాపూర్‌‌‌ శ్రీనివాసపురంలో ఘటన

హైదరాబాద్‌‌, వెలుగు : చిన్నారితో కలిసి తల్లి సూసైడ్ చేసుకున్న ఘటన రామంతాపూర్‌‌‌‌లో కలకలం రేపింది. ఉప్పల్ ‌‌పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌‌స్పెక్టర్ ‌‌‌‌రంగస్వామి తెలిపిన ప్రకారం.. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరుకి చెందిన సిమన్ ‌‌ప్రభాకర్‌‌(45), భార్య మేరీ మార్ట్(38) గె తో కలిసి కొంత కాలంగా రామంతాపూర్‌‌‌‌ శ్రీనివాస పురంలో ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో ఉంటున్నాడు. వీరికి 8 నెలల కూతురుఉంది. ప్రైవేట్‌‌జాబ్ చేస్తున్న ప్రభాకర్‌‌‌‌, మేరీ మధ్య కొంతకాలం కిందట మనస్పర్థలు తలెత్తాయి. దీంతో సోమవారం దంపతుల మధ్యతలెత్తిన వివాదంతో మేరీ తీవ్ర మనస్తాపానికి గురైంది. అపార్ట్‌‌మెంట్‌‌లోని 4వ అంతస్తు పైనుంచి కూతురుతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు స్పాట్‌‌లోనే మృతి చెందారు. ఉప్పల్ ‌పోలీసులు ఘటన స్థలానికి చేసుకుని
కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్తల కోసం

Latest Updates