కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

mother-committed-suicide-by-not-tolerating-her-sons-death

ఏడేళ్ల తన కుమారుడి మృతిని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిన ఓ తల్లి కిరోసిన్ తో నిప్పట్టించుకుని ఆత్మహత్య చేసుకుంది. 5 రోజుల తర్వాత ఆమె హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఈ ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఎండీ హాజీ(31), ఫరీదాబేగం(28) దంపతు లు బహుదూర్ పల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందులో చిన్న వాడైన ఎండీ షరీఫ్(7) మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి ఫరీదాబేగం డిప్రెషన్ లోకి వెళ్లింది. ఈ నెల 14న సా యంత్రం 7.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫరీదాబేగం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు ఆమె భర్తకు సమాచారం ఇచ్చా రు. అప్పటికే ఫరీదాబేగం శరీరాని కి 70 శాతం గాయాలయ్యాయి . ఆమెను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఫరీదా బేగం చనిపోయింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates