కరోనా బంద్​తో తల్లిని కడసారి చూడలేకపోయాడు

వెల్గటూర్, వెలుగు: కన్నతల్లి చనిపోతే కరోనా ఎఫెక్ట్​తో అంత్యక్రియలకు సైతం కొడుకు హాజరు కాలేని దుస్థితి జగిత్యాలలో వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పాశిగాం గ్రామానికి చెందిన కోన అమృత(50) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. భర్త కోన శంకరయ్య  మాజీ సర్పంచ్.

వీరి కొడుకు తిరుపతి కొన్ని నెలల కిందట ఉపాధి నిమిత్తం ఇరాక్ కు వెళ్లాడు. ఆదివారం తల్లి చనిపోయిందన్న విషయం అతడికి తెలిసింది. అయితే కడసారి చూపు చూడడానికి ఇండియాకి రాలేని పరిస్థితి. కరోనా ప్రభావంతో ప్రభుత్వాలు రాకపోకలు నిలిపివేయడంతో  అక్కడే చిక్కుకుపోయాడు. తల్లి చివరిచూపూ దక్కలేదని దుఃఖంలో మునిగిపోయాడు.

Latest Updates