ఆత్మీయతల నడుమ ‘జననికి జయంత్యోత్సవం’

హైదరాబాద్, వెలుగు: తల్లి గొప్పతనాన్ని, ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలిపేందుకు శనివారం శిల్పారామంలోని  సంప్రదాయ వేదికలో ‘జన్మనిచ్చిన జననికి జయంత్యోత్సవం’ అనే కార్యక్రమం ఆత్మీయతలు..అనుబంధాల నడుమ ఆహ్లాదంగా సాగింది. పిల్లలు తమ తల్లులకు పాద పూజ చేశారు. అనంతరం దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ నిర్వహణలో సిద్ధ గురువులు ఆత్మానందమయి మాతాజీ ప్రవచనాలుచేశారు. మాతాజీ రచించి న సుషుమ్న క్రియా యోగ కిరణం గ్రంథాన్ని ఐజీ సౌమ్య మిశ్రా ఆవిష్కరించారు. ఉచిత ధ్యాన పద్ధతి కోసం www.divyababajikriyayoga.org వెబ్ సైట్ ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Latest Updates