మునిగినా బిడ్డ చేతిని వదల్లేదు..

మలప్పురం: కేరళలోని భారీ వర్షాలకు మల్లపురంలోని కొట్టకున్ను ఏరియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వరద నీరు ఉప్పొంగి సమీపంలోని ఇండ్లను ముంచెత్తింది. ఓ ఇంట్లోని తల్లీబిడ్డా వరదలో గల్లంతయ్యారు. ఇంటి వెలుపల ఉన్న భర్త శరత్ మాత్రం ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. భార్య గీత, ఏడాదిన్నర వయసున్న బాబు ఆచూకీ కోసం రెండు రోజుల పాటు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద తగ్గిన తర్వాత బురదను తొలగించే ప్రయత్నంలో వారి మృతదేహాలు బయటపడ్డాయి. భార్యబిడ్డల మృతదేహాలను చూసి శరత్​ కన్నీరుమున్నీరయ్యారు. అంతటి ప్రమాదంలో కూడా బిడ్డను రక్షించుకోవడానికి ఆ తల్లి ప్రయత్నించిందన్న దానికి గుర్తుగా కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది. చనిపోయినా బిడ్డ చేతిని వదలని ఆ తల్లి మృతదేహాన్ని చూసి రెస్క్యూ టీం కంటతడి పెట్టింది.

Latest Updates