తల్లి మందలించిందని స్టూడెంట్​ సూసైడ్​

బోయినిపల్లి, వెలుగు: మంచిగా చదివి పరీక్షలు బాగా రాయాలని తల్లి మందలించడంతో ఓ డిగ్రీ స్టూడెంట్​ సూసైడ్​ చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని  భగవంతరావు నగర్ కు చెందిన వెగ్గేలం భవ్యశ్రీ(21 ) హాస్టల్​లో ఉంటూ కరీంనగర్​లోని ప్రైవేట్​కాలేజీలో డిగ్రీ సెకండ్​ ఇయర్​ చదువుతోంది. ఈ నెల 1న ఆదివారం ఇంటికి వచ్చింది. చదువు విషయంలో తల్లి మందలించడంతో 3న మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానంటూ బయటకు వచ్చింది.

బోయినిపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి కింద మృతదేహం తేలుతోందని గురువారం పోలీసులకు సమాచారం అందింది. భవ్యశ్రీ తండ్రి బాల బ్రహ్మచారి మృతదేహాన్ని చూసి తన కూతురిదిగా గుర్తించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రోజే మిడ్ మానేర్ లో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి

Latest Updates