చనిపోతానని తెలిసి కన్నబిడ్డలనే చంపేసింది

  • నిద్రమాత్రలు వేసి.. గొంతుపై కాలేసి తొక్కి..
  • అనారోగ్యంతో తనకేమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏమిటని ఘాతుకం
  • పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ నిజం

హైదరాబాద్​, వెలుగు: పాతబస్తీలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను హత్య చేసింది. ‘నీకు బీమారీ వచ్చింది. ఏదైనా అయితే నీ పిల్లలను ఎవరు చూసుకుంటారు’ అని ఎవరో అంటే అదే ఆలోచిస్తూ ఉండేది. చివరకు పిల్లలను చంపాలని నిర్ణయించుకుంది. 26న రాత్రి భర్త లేనప్పుడు 8,9 తరగతి చదువుతున్న అన్నా చెల్లెళ్లకు నిద్రమాత్రలు వేసింది. ‘అమ్మా..మత్తుగా ఉంది’ అంటే.. ఇన్సులిన్‌‌ ఇంజక్షన్‌‌ ఇచ్చింది. అప్పటికీ స్పృహలోనే ఉండడంతో గొంతుపై కాలేసి తొక్కి చంపేసింది. ఇంటికి వచ్చిన భర్త పిల్లలను చూసి దవాఖానకు తీసుకుపోయాడు. పోస్ట్‌‌ మార్టం రిపోర్టులో మర్డర్‌‌ అని తేలడంతో అనుమానంతో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది.

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న తల్లిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్తి వివరాలను ఏసీపీ శివరామ శర్మ, స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడిం చారు. చాం ద్రాయణగుట్ట సెగ్మం ట్ బాబానగర్ బస్తీలో నివసిం చే దంపతులు సయ్యదా ఫర్హా త్ బేగం, మహ్మద్ అబ్దుల్ రహీంకు ఇద్దరు పిల్లలు నేహాజబీన్ (15), మహ్మద్ అబ్దుల్ అజీజ్ (14). ఇద్దరూ స్థానిక పాఠశాల్లో 8, 9 తరగతులు చదువుతున్నారు.  ఇదిలా ఉండగా తల్లి సయ్యద్ ఫర్హత్ బేగంకు ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టా యి. దీంతో చికిత్సను తీసుకుంటోం ది.అయితే తన మరణం తరువాత పిల్లలను చూసేవారు ఉండరని భావిం చి తన పిల్లలను ముందుగా చంపి తరువాత తాను చనిపోవచ్చునని నిర్థా రించుకుం ది. ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు డోస్ ఇచ్చిన వెంటనే ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చిం ది. ఇంకా పిల్లలు స్పృహలోనే ఉన్నారని భావిం చి ఆమె ఇద్దరు పిల్లల గొంతు పై కాలితో తొక్కింది. చనిపోయారని తెలుసుకున్న తల్లి బంధువుల ఇంటికి రాత్రి వెళ్లిపోయిం ది. రాత్రి ఇంటికి వచ్చి చూసిన భర్తకు పిల్లలు విగత జీవులుగా కనిపిం చడంతో ఆయన ఆసుపత్రికి తరలిం చగా అప్పటికే పిల్లలు చనిపోయారని వైద్యు లు తెలిపారు.

 

Latest Updates