ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి సూసైడ్ చేసుకున్న తల్లి

  • కుటుంబ గొడవలే కారణం

ముజఫర్​నగర్: యూపీలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆపై తానూ సూసైడ్ చేసుకున్న ఘటన ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ గొడవలతో కలత చెందిన మన్సూర్​పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ .. తన కొడుకు రుద్రాక్ష్(5), కూతరు మహి(7)లకు విషం ఇచ్చి, ఆ తర్వాత తానూ తాగిందని పోలీసులు శనివారం వెల్లడించారు. స్థానికులు గమనించి సమాచారం అందించగా ముగ్గురిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తల్లి లక్ష్మీ చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు. తొమ్మిదేళ్ల కిందట లక్ష్మీకి పెళ్లయిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest Updates