బాబు ఏడ్చాడని మూతికి ఫెవిక్విక్‌ పెట్టిన తల్లి

బీహార్‌‌‌‌‌‌‌‌లో కన్న తల్లి నిర్వాకం. పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? లాలించి ముద్దుచేస్తారు. కానీ ఓ తల్లి మాత్రం కొడుకుమూతికి ఫెవిక్విక్‌‌‌‌‌‌‌‌ (బంక) పెట్టి ఏడుపుఆపించే ప్రయత్నం చేసింది. శనివారం బీహార్‌ లోని ఛాప్రా నగరంలో జరిగిందీఘటన. కొడుకు నిశ్శబ్దంగా ఉండటం, తన నోటి నుంచి నురుగు రావడం గమనించి భార్యను ఏమైందని భర్త అడగ్గా..పొద్దున్నుంచి పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడని, అందుకే ఏడుపు ఆపడానికి పెదాలకు ఫెవిక్విక్‌‌‌‌‌‌‌‌ పెట్టానని చెప్పింది. వెంటనే కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లాడు తండ్రి. ప్రస్తుతం పిల్లాడికి ఏం అపాయం లేదని డాక్టర్లు చెప్పారు.

Latest Updates