పిల్లలపై పెట్రోల్ పోసి తాను నిప్పంటించుకుంది

కర్నూలు : అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నతల్లే పిల్లలను దారుణంగా చంపేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నరసింహులు, పద్మావతి దంపతులకు మనోజ్‌కుమార్‌(5), సంజీవ్‌(4) అనే ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ సమస్యలతో  కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నరసింహులు పని మీద బయటకు వెళ్లగా ఇంట్లో నిద్రిస్తున్న తన ఇద్దరు కుమారులపై పద్మావతి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది.

తర్వాత ఆమె కూడా పెట్రోలు పోసుకుని  ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. పిల్లలను స్థానిక హస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates