అప్పుడే పుట్టిన బిడ్డను వదిలివెళ్లేందుకు ప్రయత్నించిన తల్లి

అప్పుడే పుట్టిన మగ బిడ్డను వదిలి వెళ్లేందుకు ప్రయత్నించింది ఓ తల్లి. ఈ ఘటన గురువారం పొద్దున గాంధీ హాస్పిటల్ లో జరిగింది. కామారెడ్డికి చెందిన మంజుల అనే మహిళ ప్రసవంకోసం గాంధీ హాస్పిటల్ కు వచ్చింది. ఇందులో భాగంగా… బుధవారం మగ శివువుకు జన్మనిచ్చింది. అయితే గురువారం తన బిడ్డను హాస్పిటల్ లోనే వదిలి వెళ్తేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించారు. మంజులను నిలదీయగా.. తాను తన బిడ్డను వదిలి వెళ్లిపోతున్నానని చెప్పింది. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని కేసునమోదు చేసుకున్నారు. దీంతో పాటు తల్లినీ బిడ్డను దివ్య దిశ కేంద్రానికి తరలించారు. మంజుల భర్త కామారెడ్డిలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates