ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి…ఇద్దరు పిల్లలు మృతి

సూర్యాపేటలో దారుణం జరిగింది. ఓ తన కూతురు,కుమారుడితో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా…కూతురు,కుమారుడు చనిపోయారు.

పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నాగమణి… కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలు కూతురు జ్యోతిమాధవి(9) కొడుకు హర్షవర్ధన్ (6) కలసి నిన్న(ఆదివారం) రాత్రి సుద్దాల చెరువులో దూకింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులోకి దూకి వారి ప్రాణాలను కాపాడుందుకు ప్రయత్నించారు. ఘటన తల్లి ప్రాణాలతో బయటపడింది. ఇద్దరు పిల్లల జాడ మాత్రం దొరకలేదు. ఈ విషయాని స్థానికులు పోలీసులు తెలియ జేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక, బాలుడి క కోసం గాలించడంతో వారి మృతదేహాలు దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates