లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై అత్యాచారం

ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా, ఎన్ కౌంటర్ లు చేసినా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. తిరుపతి సమీపంలోని ముళ్ళపూడిలో 16 ఏళ్ళ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది.  లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి ఇద్దరు యువకులు బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వెంకటేశ్, రాజమోహన్ నాయక్ గా గుర్తించారు.