ఫ్లిప్‌‌కార్ట్‌‌‌లో మోటరోలా టీవీలు

న్యూఢిల్లీ: తాజాగా స్మార్ట్‌‌ టీవీల మార్కెట్లోకి అడుగుపెట్టిన చైనీస్‌‌ కంపెనీ మోటోరోలా వీటి అమ్మకాల కోసం ఫ్లిప్‌‌కార్ట్‌‌తో జట్టుకట్టింది. ఇండియా స్మార్ట్‌‌ టీవీల మార్కెట్‌‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి శామ్‌‌సంగ్‌‌, షావోమీ, మైక్రోమాక్స్‌‌, ఇంటెక్స్‌‌ మాదిరే ఇది కూడా స్మార్ట్‌‌ఫోన్ల విభాగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మోటోరోలా సోమవారం 32 ఇంచుల నుంచి 65 ఇంచుల సైజులతో టీవీలను విడుదల చేసింది. వీటి ధరలు రూ.14 వేల నుంచి మొదలవుతాయి. నాలుగు స్మార్ట్‌‌ఫోన్ల మార్కెటింగ్‌‌కు ఇది వరకే ఫ్లిప్‌‌కార్ట్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు టీవీలను కూడా దీని ద్వారానే అమ్ముతామని మోటోరోలా సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ప్రశాంత్‌‌ మణి వివరించారు.

Latest Updates