సిమ్ లేని స్మార్ట్ ఫ్లిప్ ఫోన్

ఫ్లిప్ ఫోన్ అలియాస్  ఫోల్డింగ్​ ఫోన్​.. ఒకప్పుడు ఫోన్ల ప్రపంచాన్ని ఊపేసిన ఫోన్​ అది. 2000వ సంవత్సరంలో మోటోరోలా తీసుకొచ్చిన ఆ ఫోన్​కు అప్పట్లో ఉన్న ఆ క్రేజే వేరు. మళ్లీ ఇప్పుడు ఆ మోడల్​ ఫోన్​నే కొంచెం కొత్తగా, స్మార్ట్​గా తీసుకొచ్చేసింది మోటోరోలా. రేజర్​ పేరుతో గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. 6.2 అంగుళాల డిస్​ప్లేతో వచ్చిన ఫోన్​ను మధ్యలోకి మడతపెట్టేయొచ్చు. పాత మోడల్​ ఫ్లిప్​ ఫోన్​లో కింద కీప్యాడ్​, పైన స్క్రీన్​ ఉండేది. కొత్త స్మార్ట్​ఫ్లిప్​లో మొత్తం స్క్రీనే ఉంటుంది. ఆ స్క్రీన్​ మధ్యలోకి మడతపడిపోతుంది. శాంసంగ్​ గెలాక్సీ ఫోల్డ్​లాగే ఉన్నా, రేజర్​ మాత్రం కొంచెం కొత్తగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గెలాక్సీ ఫోల్డ్​ను పుస్తకంలా మడిచేస్తే, రేజర్​ను నిలువుగా మడతపెట్టాలని అంటోంది. ఫోన్​ను క్లోజ్​ చేస్తే 2.7 అంగుళాల క్విక్​ వ్యూ డిస్​ప్లే ఉంటుంది. ఆ డిస్​ప్లేలోనే నోటిఫికేషన్లు కనిపిస్తాయి. స్మార్ట్​ఫోన్​లో ఉండే అన్ని ఫీచర్లతో వస్తోంది రేజర్​. ప్రస్తుతానికి కేవలం అమెరికాలోనే అమ్మకాలు జరగనున్నాయి. వచ్చే ఏడాది కెనడా, బ్రిటన్​లో విడుదల చేయనున్నారు.

కెమెరా: 16 ఎంపీ (వెనక), 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

సెన్సర్లు: ఫింగర్​ప్రింట్​ రీడర్​, యాక్సెలోమీటర్​, మాగ్నెటోమీటర్​, గైరో, ప్రాక్సిమిటీ, యాంబియెంట్​ లైట్​, జీపీఎస్​.

బ్యాటరీ: 2510 ఎంఏహెచ్​, ఫోన్​లోనే
ఫిక్స్​ అయి ఉంటుంది.

చార్జింగ్: 15 వాట్​ టర్బోపవర్​.

కనెక్టివిటీ: 4జీ, యూఎస్​బీ 3.0 (టైప్​ సీ)

 

Latest Updates