రేపు అన్ని డిపోల దగ్గర కుటుంబ సభ్యులతో మౌనదీక్ష

రాష్ట్రంలో  ప్రజాస్వామ్యం  ప్రమాదంలో  పడిందన్నారు  ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ  సంఘాల నేతలు  తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మెకు మద్దతు కోరేందుకు లక్ష్మణ్‌ను కలిసినట్లు తెలిపారు. రేపు అన్ని డిపోల దగ్గర కుటుంబ సభ్యులతో మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తమ సమ్మెకు టీఎన్జీవోల మద్దతు ఉంటుందని అనుకుంటున్నామన్న అశ్వత్థామరెడ్డి… ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయన్నారు.

 

Latest Updates