మద్యానికి బానిసలైన వారిని PHC కి తరలించండి

మందుకు బానిసలుగా మారిన వ్యక్తులపై దృష్టి పెట్టి…వారు మానసిక ఆందోనకు గురికాకుండా చూడాలన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్… లిక్కర్ షాపులు మూసివేయడం…మద్యానికి వ్యసనంగా మారి వింతగా ప్రవర్తిస్తున్న వారి విషయాలపై చర్చించారు. దీనిపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

మద్యానికి బానిసలుగా మారిన వ్యక్తులు ఎక్కువగా ఆందోళనకు గురైతే ఎక్సైజ్ శాఖ సిబ్బంది… అలాంటి వ్యక్తులను గుర్తించి వారికి మానసిక వేదనకు గురికాకుండా సరైన అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే వారిని దగ్గర్లో ఉన్న  PHC సెంటర్లకు తరలించి ట్రీట్ మెంట్ అందించాలన్నారు.

అంతేకాదు వారి మనసును మద్యం నుంచి మరల్చడానికి యోగ, ద్యానం, వ్యాయామం, ఆటలు ఆడించేలా కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. ఆటలతో మానసిక శక్తి పెరుగుతుందన్నారు. మరోవైపు లాక్ డౌన్ టైం లో వైన్ షాపులు తెరవకుండా చూడాలని… గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest Updates