విడుదలకు ముందే యూట్యూబ్‌లోకి సినిమా

‘నానిగాడు’హీరో ఆందోళన

హైదరాబాద్‌, వెలుగు: విడుదలకు ముందే నానిగాడు సినిమా యూట్యూబ్‌లోకి వచ్చింది. దీంతో హీరో దుర్గా ప్రసాద్ మంగళవారం ఫిలిం చాంబర్ వద్ద ఆందోళన చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన లింకును తొలగించాలని, లేకపోతే చిత్రబృందమంతా కలిసి బుధవారం ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సినిమాకు రూ.40 లక్షలు ఖర్చు చేశామని, సెన్సార్ బోర్డు ‘యు’సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పారు. ఇలా సినిమాను యూట్యూబ్‌లో పెట్టడంతో తాము ఎంతో నష్టపోతామని, తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Latest Updates