గీతా ఆర్ట్స్‌లో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది

సినిమా అవకాశాలు ఇస్తానని నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని జూ.ఆర్టిస్ట్ బోయ సునీత చేసిన ఆరోపణలపై ఆయనే వివరణ ఇచ్చాడు. ఇందుకు గాను బన్నీ వాసు వీడియో రిలీజ్ చేశారు. తాము సునీతకు చాలా అవకాశాలు  ఇచ్చామని అయితే.. సునీత మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడంవల్ల  అవకాశాలను ఉపయోగించుకోలేకపోయిందని చెప్పాడు వాసు.

సునీత తాను మెగా ఫ్యామిలీకి ఫ్యాన్‌ను అని చెప్పిందని.. తమపై కూడా గౌరవంగా ఉండేది కాబట్టే సినిమా అవకాశాలు ఇవ్వడానికి చూశామని చెప్పాడు వాసు. అయితే ఆడిషన్స్ టీంకు టచ్ లో ఉండాలని.. ఆడిషన్స్ ఇచ్చిన తరువాతనే అవకాశాలు ఇస్తామని అన్నట్లు చెప్పామని అన్నాడు. అయితే సునీత మాత్రం ఆడిషన్స్ ఇవ్వకుండానే తనకు సినిమా అవకాశాలు ఇవ్వాలని కోరినట్టు బన్ని వాసు తెలిపాడు. ఇందుకు తాను ఒప్పుకోలేదని.. అందుకే గీతా ఆర్ట్స్ గేటుకు సునీత తనను తాను బందించుకుని నానా హంగామా చేసిందని చెప్పాడు. దీంతో పాటే గీతా ఆర్ట్స్‌లో కత్తితో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఫేస్ బుక్ లైవ్ పెట్టిందని.. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లకు ఎవరైనా ఎలా అవకాశాలు ఇస్తారని అన్నాడు. జనసేనలో పనిచేస్తేనో… మెగాఫ్యామిలీకి అభిమాని అయితేనో సినిమా అవకాశాలివ్వరని చెప్పాడు.

Latest Updates