సినీ నటుడు కార్తీ 10 వేల ఎకరాలకు నీరు అందించాడు

రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరోలు అన్పించుకుంటున్నారు తమిళ నటులు సూర్య ఆయన తమ్ముడు కార్తీ.ఇప్పటికే సూర్య ‘అగరం’ ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులు ఎందరికో విద్యాదానం చేస్తున్నాడు. అనాథలను చేరదీయడం, వారికి విద్య, గుండెజబ్బులు ఉన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించడం వంటి ఎన్నో పనులు చేస్తున్నాడు. అంతేకాదు… ఇటీవలే కరోనా కారణంగా నష్టపోయిన సినీ కార్మికులకు రూ.2 కోట్లు ఆర్ధిక సహాయం అందించాడు సూర్య. అన్న సూర్య బాటలోనే పయనిస్తున్నాడు తమ్ముడు కార్తీ.

రైతుల కోసం ‘ఉళవన్’ అనే ఫౌండేషన్ నడుపుతున్న కార్తీ… ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే రైతుల కోసం ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేశాడు. ఈ ఫౌండేషన్ ద్వారా కార్తీ  లేటెస్టుగా 10వేల ఎకరాల భూమికి నీరు అందించాడు. తిరున‌ల్వేలి జిల్లాలోలోని సూర‌వ‌ళి కాలువ‌కు రూ.4 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించడంతో 8 చెరువులు, కుంట‌ల‌కు సాగునీరు అందుబాటులోకి రానుంది. ఆ నీటితో సుమారు 10 వేల ఎక‌రాల్లో పంట‌లు పండించుకోవచ్చు. దాంతోపాటు 10  గ్రామాల నీటి స‌మ‌స్యలూ తీరనున్నాయి. కాలువ పనులు కేవ‌లం 21 రోజుల్లో పూర్తయ్యాయి.

Latest Updates