అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ ఓపెన్

ఢిల్లీ: కరోనా క్రమంలో 7 నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. సగం సీట్లతో అనుమతినిస్తూ బుధవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..అక్టోబర్ 15 నుంచి సినిమా థియోటర్లకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ తెరుచుకోవచ్చని చెప్పింది. థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ పాటించాలని సూచించింది.

అన్ ‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను ప్రకటించింది. స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినిచ్చింది.  అలాగే కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

Latest Updates