సిన్మా చూస్తూ మెట్రో జర్నీ

ప్యాసింజర్స్‌‌‌‌కు ఇక ఫుల్​ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌

మొదట తొమ్మిది మెట్రో స్టేషన్ల పరిధిలో అందుబాటులోకి..

ఇప్పటికే హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ ఫ్రీ వైఫై సర్వీసులు


షుగర్‌‌‌‌ బాక్స్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌తో అగ్రిమెంట్‌‌‌‌

ఇక నుంచి మెట్రోజర్నీని మరింతగా ఎంజాయ్‌‌ చేయొచ్చు. ప్యాసింజర్స్‌‌ కు ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ను అందించేందుకు హెచ్‌‌ఎంఆర్‌‌ (హైదరాబాద్‌‌ మెట్రో రైల్‌‌) కొత్తగా జీ5 యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్‌‌ లేకపోయినా ఈ అప్లికేషన్‌‌ను వాడుకునే సదుపాయం ఉండటం మరో ప్రత్యేకత. మూడు నిమిషాల్లో ఒక   సిన్మాను డౌన్‌‌లోడ్‌‌ చేసుకొని హ్యాపీగా చూడొచ్చు. మెట్రో స్టేషన్లలోనే కాకుండా రైళ్లలోనూ అన్‌‌లిమిటెడ్‌‌గా యూజ్‌‌ చేసుకోవచ్చు.  దీని కోసం మంగళవారం షుగర్‌‌బాక్స్‌‌ నెట్‌‌వర్క్స్‌‌ అనే సంస్థతో అగ్రిమెంట్‌‌ చేసుకుంది. మెట్రోకు సంబంధించిన నాగోల్​ – మియాపూర్​  మధ్య  తొమ్మిది స్టేషన్ల పరిధిలో ఈ సేవలు పొందొచ్చు. ఆండ్రాయిడ్‌‌, ఐఓఎస్‌‌  రెండు వెర్షన్లలోనూ వాడుకోవచ్చు. మొబైల్‌‌ నెంబర్‌‌ ద్వారా లాగిన్‌‌ అవ్వాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ‌ ‌ మెట్రో రైలు ప్రయాణానికి మరింత ఎంటర్ ‌ ‌టెయిన్ ‌ ‌మెంట్ ‌ ‌ యాడ్​అయ్యింది. స్మార్ట్​ఫోన్లో వీడియోలు చూస్తూ ప్రయాణించే అవకాశం కలిగింది. సరికొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని ప్రయాణికులకు అందించేందుకు హెచ్ ‌ ‌ఎంఆర్ మరో అడుగు ముందుకేసింది. కదులుతున్న రైళ్లతో పాటు మెట్రో స్టేషన్లలోనూ అన్ ‌ ‌ లిమిటెడ్ ‌ ‌ యాప్స్​ప్రొవైడ్​చేయనుంది. ఇందుకోసం హెచ్ ‌ ‌ఎంఆర్ ‌ ‌, షుగర్ ‌ ‌ బాక్స్ ‌ ‌ నెట్ ‌ ‌వర్క్స్ ‌ ‌ తొమ్మిది మెట్రో స్టేషన్ల జోన్ల పరిధిలో సేవలు అందించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. గతంలో మెట్రో స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈసారి షుగర్ ‌ ‌బాక్స్ ‌ ‌ నెట్ ‌ ‌వర్క్స్ ‌ ‌తో కదులుతున్న రైళ్లలోనూ నెట్​అందనుంది. ఇక అన్ ‌ ‌లిమిటెడ్ ‌ ‌ డౌన్ ‌ ‌లోడ్ ‌ ‌, యాప్ ‌ ‌లను రన్ ‌ ‌ చేసుకోవచ్చు. మొబైల్ డేటా చార్జీలు లేకుండా వైఫై ద్వారా ఇంటర్నెట్ ‌ ‌ యాక్సిస్ ‌ ‌ చేయొచ్చు. జీ5 లేదా ఫ్రీప్లే యాప్ ‌ ‌లోని కంటెంట్ ‌ ‌ను యాక్సెస్ చేయొచ్చు.

నాగోలు– మియాపూర్​లైన్​లో..

షుగర్ ‌ ‌బాక్స్ ‌ ‌ నెట్ ‌ ‌వర్క్ ‌ ‌ అనేది లోకల్ నెట్ ‌ ‌వర్క్ ‌ ‌ ప్రొవైడర్ ‌ ‌. ఇప్పటికే షుగర్ ‌ ‌ బాక్స్ ‌ ‌ 9 నగరాల్లో 200కి పైగా ప్లేస్ ‌ ‌ ఆఫ్ ‌ ‌ ఇంటరెస్ట్ ‌ ‌(POI)లలో అందుబాటులో ఉంది. మెట్రో ప్రయాణికులు తమ మొబైల్స్ ‌ ‌లో వైఫై సెట్టింగ్స్ ‌ ‌ ఆన్ ‌ ‌చేస్తే అక్కడ షుగర్ ‌ ‌బాక్స్ ‌ ‌ కనిపిస్తుంది. క్లిక్ ‌ ‌ చేసిన తర్వాత ‘జీ5’ డిస్ ‌ ‌ప్లే వస్తుంది. ఈ యాప్ ‌ ‌ను ప్లే స్టోర్ ‌ ‌ లేదా యాపిల్ ‌ ‌ స్టోర్ ‌ ‌ ద్వారా డౌన్ ‌ ‌ లోడ్ ‌ ‌ చేసుకోవచ్చు. మొబైల్ ‌ ‌ నెంబర్ ‌ ‌ ఆధారంగా లాగిన్ ‌ ‌ చేయాల్సి ఉంటుంది. మ్యూజిక్ ‌ ‌, సినిమాలు.. ఇలా వివిధ భాషల్లో ఉంటాయి. నచ్చిన సినిమాను చూస్తూ లేదా సంగీతాన్ని ఆస్వాదిస్తూ మెట్రో జర్నీని మరింత సుఖవంతంగా పూర్తిచేయొచ్చని మెట్రో అధికారులు చెబుతున్నారు. మొబైల్స్ ‌ ‌లో డేటా ఆఫర్ ‌ ‌ లేకపోయినా ఇంటర్నెట్ ‌ ‌ లేకపోయినా జీ5 అప్లికేషన్ ‌ ‌ను వాడుకునే సదుపాయం ఉండటం మరో ప్రత్యేకత. జీ5 ఇక మెట్రో జర్నీని ఎంజాయ్ ‌ ‌ రైడ్ ‌ ‌గా మార్చనుంది. కేవలం 3 నిమిషాల్లోనే మొత్తం సినిమాను డౌన్ ‌ ‌లోడ్ ‌ ‌ చేసుకునేలా సేవలు ఉన్నాయి.

ఎంతో ఇన్ఫర్మేషన్​

జీ5 ద్వారా కేవలం వినోదాంశాలే కాదు.. సాధారణంగా అవసరమైన అన్ని రకాల సర్వీసుల సమాచారం అందుబాటులో ఉంటుంది. మెట్రో ప్రయాణికులకు అవసరమయ్యే సేవలకు సంబంధించి ప్రజా రవాణా, ఇంటర్ ‌ ‌సిటీ బస్సులు, హోటళ్లు, రెస్టారెంట్స్ ‌ ‌ & బార్స్ ‌ ‌, షాపింగ్ ‌ ‌ మాల్స్, హాస్పిటల్స్, రెసిడెన్షియల్, కార్పొరేట్ భవనాలు వివరాలు అందుబాటులో ఉంటాయి. ఫుడ్ ‌ ‌ డెలీవరీ సర్వీసులు ఈ యాప్ ‌ ‌లో నిక్షిప్తమై ఉంటాయి. వీటి ద్వారా ప్రయాణికులు మెట్రో ప్రయాణంలోనూ, ఆ తర్వాత అవసరమైన ప్రాంతాలను, సర్వీసులను పొందవచ్చు. సంగీతం, గేమింగ్, షాపింగ్, ఇ-లెర్నింగ్, ఫుడ్ డెలివరీ, హైపర్ ‌ ‌లోకల్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రస్తుతం తొమ్మది మెట్రో స్టేషన్ల జోన్ల పరిధిలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మెట్రోలోని అన్ని స్టేషన్లలో విస్తరిస్తామని హెచ్ ‌ ‌ఎంఆర్ ‌ ‌ అధికారులు చెబుతున్నారు.

Latest Updates