మావోయిస్టుల మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు

ములుగు జిల్లా: ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ బందోబస్తు నడుమ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఇద్దరి మృతదేమాలను బంధువులకు అప్పగించారు. ,రవ్వ రాములు @ సుధీర్ (మణుగూరు ఏరియా దళ కమాండర్),  దళ సభ్యుడు లక్మాల్ మృతదేహాలకు ములుగు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం సందర్భంగా కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ప్రతిపక్షాలు, పౌర హక్కుల సంఘం నాయకులు తరలిరావచ్చారు. అయితే పోలీసులు భారీగా మొహరించి ఎవరినీ అనుమతించలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతుల బంధువులకు మృత దేహాలు అప్పగించి వారి స్వగ్రామాలకు తరలించారు.

Latest Updates