15ఏళ్లుగా అత్యాచారం : నిందితుణ్ని 25సార్లు కత్తితో పొడిచి చంపిన బాధితురాలు

మధ్యప్రదేశ్ లో కీచకుడిపై ఓ మహిళ అపరకాళి అవతారం ఎత్తింది. వీడియోలు చూపించి తనని గత 15ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న నిందితుణ్ని కత్తితో 25సార్లు పొడిచి చంపింది.

రాజధాని భోపాల్‌కు 214 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ గుణాలో గత 15 సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేస్తున్న  31 ఏళ్ల మహిళ నిందితుణ్ని 25 సార్లు కత్తితో పొడిచి చంపింది. అ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

అశోక్ నగర్ లో నివాసం ఉండే నిందితుడు బ్రిజ్ భూషణ్ శర్మ 2005లో 16 సంవత్సరాల వయస్సున్న ఓ బాధితురాలి అత్యాచారం చేశాడు. అప్పటి నుండి ఆమెను బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ దారుణంపై ఎవరికైనా చెబితే వీడియోల్ని బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో చేసేదిలేక బాధితురాల్ని సైలెంట్ గా ఉండిపోయింది. బాధితురాలి నిస్సాహాతను  ఆసరాగా చేసుకున్న నిందితుడు 16ఏళ్లుగా ఆమెపై దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. బాధితురాలు పెళ్లైనా సరే ఆమెను బెదిరించి..విధుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లే భర్త లేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు.

తాజాగా భర్త లేని సమయంలో బాధితురాలి ఇంట్లో  చొరబడ్డ నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు. దీంతో విచక్షణ కోల్పోయిన

బాధితురాలు వంటగదిలో ఉన్న కత్తితో నిందితుడిని 25సార్లు కత్తితో పొడిచి చంపింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతు 15ఏళ్ల నుంచి నిందితుడు తనపై అత్యాచారం చేస్తున్నాడని అందుకే హత్యచేసినట్లు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates