నిరూపిస్తే రాజీనామా చేస్తా.. హరీశ్ కు అర్వింద్ సవాల్

రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెడతారంటూ మంత్రి హరీశ్ రావు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ అర్వింద్ సవాల్ విసిరారు. విద్యుత్ బిల్లులో మోటర్లు పెట్టాలంటూ ఉందని నిరూపిస్తే, ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు అర్వింద్.  దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాష్ట్రంలో మార్పుకు నాంది పలుకుతుందన్నారు . మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ లో పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను దోచి, రజాకార్లను మోస్తున్నారని ఆరోపించారు.

చెన్నైని ముంచెత్తిన భారీ వర్షాలు

దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు

Latest Updates