ప్రతి పైసాకు కేసీఆర్‌‌ లెక్కజెప్పాలె

న్యూఢిల్లీ, వెలుగుకేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు, రాష్ట్ర అభివృద్ధి పేరిట చేసిన ప్రతి రూపాయి అప్పుకు సీఎం కేసీఆర్ లెక్క చెప్పాల్సిందేనని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్ కాదని, కోట్లు ఎగ్గొట్టి నీరవ్‌‌‌‌ మోడీలా విదేశాలకు పారిపోయే చాన్స్‌‌‌‌ లేదన్నారు. తప్పు తేలితే… ఫామ్‌‌‌‌హౌజ్ నుంచి శ్రీకృష్ణుడి జన్మస్థలానికి పంపించే కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం ఢిల్లీలోని విజయ్‌‌‌‌చౌక్‌‌‌‌లో ఎంపీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి నిధుల విడుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‌‌‌సభలో ఇచ్చిన సమాధానంతో ఇన్ని రోజులు ‘పింక్ దొర’ కేంద్రంపై చేస్తున్న విమర్శలు పచ్చి అబద్ధాలని తేలిందన్నారు. కేంద్రం దాదాపు రూ.1.52 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. జీఎస్టీ పన్నుల పరిహారం, లోకల్‌‌‌‌బాడీలకు నిధులు, కేంద్ర పథకాల వాటాను కలుపుకుంటే సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిందని వివరించారు.

ఈ లెక్కల్ని బీజేపీ చెప్పడం లేదని.. ఇది కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన సమాధానం అన్నారు. ఫెర్టిలైజర్స్ సబ్బిడీ, రేషన్‌‌‌‌బియ్యంపై సబ్సిడీ, ఉపాధిహామీ నిధులు, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్‌‌‌‌ యోజన వంటి సబ్సిడీ స్కీమ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ ఈ లిస్ట్‌‌‌‌లో లేవన్నారు. ఫైనాన్స్‌‌‌‌పవర్ కార్పొ రేషన్ నుంచి 70 వేల కోట్లు, బ్యాంకుల నుంచి వంద కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుందన్నారు. మిగులు బడ్జెట్‌‌‌‌గా ఉన్న రాష్ట్రాన్ని రూ.3 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించారని మండిపడ్డారు. కేంద్ర నిధులు, అప్పుల రూపంలో ఆరేళ్లలో సమకూరిన రూ. 6 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్ర సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. కేవలం రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలే నడుస్తున్నాయని.. వీటి పేర్లతో కేసీఆర్ పైసలు లోపల వేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్.. నిధులు కావాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని పైసలు ఇవ్వాలని కోరితే,  ప్రశ్నలు అడుగుతుందనే భయంతోనే ఫండ్స్‌‌‌‌ కావాలని అడగడం లేదన్నారు.

పీఎంఏవైలో రాష్ట్రానికి ‘పెద్ద గుడ్డు’…

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో రాష్ట్రానికి కేసీఆర్ పెద్ద గుడ్డు(గాడిద గుడ్డు) మిగిల్చారని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు పీఎంఏవై ఫేజ్-1, ఫేజ్-2 లో భాగంగా పేద ప్రజల కోసం 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాయన్నారు. చివరకు కొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన లఢక్‌‌‌‌లోనూ 12 వందల ఇండ్లు కట్టారని చెప్పారు. అయితే, అన్ని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మాత్రమే సున్నాతో నిలిచిందన్నారు. డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇండ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన సర్కార్, పేద మహిళలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదన్నారు. పీఎంఏవైలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. అయితే, ఆ నిధుల వినియోగం, ఖర్చుల వివరాలు కోరితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని
విమర్శించారు.

Latest Updates