పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిండు

పసుపు బోర్డు పేరుతో MP అర్వింద్ నిజామాబాద్ రైతులను మోసం చేశాడన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రోజుకో ప్రకటనతో అర్వింద్ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆయన అన్నారు. శుక్రవారం నిజామాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..  పసుపు బోర్డు తెస్తానని చెప్పి.. ప్రాంతీయ కార్యాలయంతో సరిపెట్టారన్నారు. బోర్డు తేలేకపోయిన అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.

“30 ఏళ్ళ నుంచి నిజామాబాద్ జిల్లా ప్రజలను డీఎస్ మోసం చేస్తూ వచ్చారు.  ఇప్పుడు మళ్లీ డీఎస్ కొడుకు అర్వింద్ ప్రజలను మోసం చేస్తున్నారు. బోర్డు తెచ్చే వరకు.. లేదంటే రాజీనామా చేసే వరకు రైతులు అర్వింద్ ను నిలదీయాలి” అని MLA గోవర్ధన్ అన్నారు.

Latest Updates