పసుపు రైతుల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థ: ఎంపీ అర్వింద్

పసుపు రైతులకు పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు.  దేశంలో చాలా పంటలకు బోర్డులు ఉన్నాయన్న అర్వింద్.. వాటిద్వారా రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. కొత్త వ్యవస్థ తెలంగాణ కేంద్రంగానే పనిచేస్తుందని చెప్పారు. దీని ద్వారా రైతులకు తమ పంటలను విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సంక్రాంతి లోపు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు.రైతులను రెచ్చగొట్టేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఇకపై మన రైతులు పండించే పంటలకు సీడ్, ఎరువులు, అమ్మకం, కొనుగోలు,ఇన్సురెన్స్, క్వాలిటీని కూడా ఇక్కడే నిర్ణయిస్తామని అర్వింద్ చెప్పారు. మద్దతు ధర కూడా ఈ స్కీం ద్వారానే నిర్ణయిస్తామన్నారు. పసుపు విషయంలో రైతులు అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు. ఆంధ్రలో జగన్ పసుపుకి మద్దతు ధర ప్రకటించినప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదుని ఎంపీ ప్రశ్నించారు. మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు ఎందుకు పంపటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకి మద్దతు ప్రతిపాదనలు పంపితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా వుందని అర్వింద్ తెలిపారు.

mp-arvind-said-the-central-government-would-bring-a-special-system-for-yellow-farmers

Latest Updates