రాష్ట్రానికి హోమ్ మినిస్టరా? పాత బస్తీకా?

తెలంగాణలో సీఏఏ వర్తించదన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యలను తప్పుబట్టారు ఎంపీ అర్వింద్. రాష్ట్రంలో CAA, NRC వర్తించదని హోంమంత్రి అంటారు..ఇంతకీ ఆయన తెలంగాణకు హోమ్ మినిస్టరా? లేక పాత బస్తీకా? అని ప్రశ్నించారు.  జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన.. కష్టపడి కేంద్రం పైసలిస్తే ,అన్ని మిషన్ భగీరథ కు పెట్టామంటారు..కానీ  ఇక్కడేమో మిషన్ భగీరథ పైపులు కూడా కనిపించడం లేదన్నారు. కాళేశ్వరం పైసలు కేటీఆర్ జేబులకు పోతున్నాయన్నారు.  నిజామాబాద్ లో టీఆర్ఎస్ నేతలకు 80 శాతం కమిషన్ అందుతున్నారు. ఇటువంటి కమిషన్ లు దేశంలో ఎక్కడా లేవవన్నారు. కేటీఆర్ కు చరిత్ర తెల్వదన్నారు.  60 వేల పుస్తకాలు చదివానన్నతన తండ్రిని చరిత్ర గురించి అడిగి తెలుసుకోవాలన్నారు.

Latest Updates