సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం.. సీఎం అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

నారాయణపేట, వెలుగు: సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టమని, దీనికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగానే తెలంగాణ అసెంబ్లీలో కూడా చేయాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి ఒక్కరి బ్యాంక్​ ఎకౌంట్​లో రూ.15వేలు వేస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదన్నారు. నోట్ల రద్దుతో వందల కోట్లు బయటికి తీసుకొస్తానన్నారని, ఇప్పటివరకు ఎన్ని కోట్లు తెచ్చాడో చెప్పాలన్నారు. పేదలకు ఇబ్బందులకు గురి చేసే చట్టాలను తీసుకొస్తున్న బీజేపీని ఈ మున్సిపల్​ ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఎంఐఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఒవైసీ కోరారు.

Latest Updates