ఒక్క భార్యతోనే పరేషాన్ ఉంది ఇక ఇద్దరా…! : అసదుద్దీన్ ఓవైసీ

ఒక్క భార్యతోనే పరేషాన్ ఉందని ఇక ఇద్దరు భార్యలతో ఏలా వేగేదని అన్నారు మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కామారెడ్డిలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో మాట్లాడిన ఆయన… ముందుగా మజ్లిస్ పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. తనకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు అబద్దపు ప్రచారం సాగుతుందని.. ఇది పూర్తిగా అబద్దమని… ఒక్క భార్యతోనే పరేషాన్ ఉందని ఇద్దరు భార్యలను చేసుకుని ఎలా వేగేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తుంది: అసద్
ఇప్పటివరకు కామారెడ్డిలో మజ్లిస్ ఎందుకు ఓడిపోతుందో  అర్థం కావడంలేదని.. ఇప్పడు తాను వచ్చానని ప్రతీ ఒక్కరూ గెలుస్తారని చెప్పారు అసదుద్దీన్.  తన తండ్రి కాలంనుంచి కామారెడ్డిలో పార్టీ ఉందని తమకేమీ ఈ టౌన్ కొత్తేమి కాదని అన్నారు. ఏపార్టీ అధికారంలోకి వచ్చినా మజ్లిస్ కు పోయేదేమి లేదని చెప్పారు. ఏపార్టీకి బలం ఉంటే ఆపార్టీ మాటే చెల్లుతుందని అన్నారు.  మజ్లిస్ హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని.. రాష్ట్రం మొత్తం విస్తరిస్తుందని అన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తుందని చెప్పారు. మజ్లిస్ పోరాడితే హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెడుతుందని కొందరు అంటున్నారని అది నిజం కాదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓ శవం…

కాంగ్రెస్ పార్టీ ఓ సెక్యులర్ పార్టీనా అని అన్నారు అసద్. బీజేపీకి భయపడి.. వడయార్ కు వెళ్లి రాహుల్ పోటీచేశారని ఎద్దేవా చేశారు. సొంత లీడర్ ను గెలిపించుకోలేని కాంగ్రెస్ ఇక తనపై ఏం పోటీ చేస్తుందని చెప్పారు. బీహార్ లో నితీష్ కుమార్ ను ఓడించింది తానేనని చెప్పారు. అలాంటి నాకు కాంగ్రెస్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఓ శవమని అన్నారు.  దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందని ఎద్దేవాచేశారు అసద్. శివసేన, కాంగ్రెస్ పెండ్లిచేసుకుంటే.. రిసిప్షన్ శరద్ పవార్ చేసుకున్నాడని చెప్పారు.

దేశంలో హిట్లర్ పాలన..

దేశంలో బీజేపీ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని అన్నారు అసద్. ముస్లింలకు తప్ప అందరికి పౌరసత్వం ఇస్తున్నారని అన్నారు. కోటి 30 లక్షల భారతీయులకు మోడీ అబద్ధాలు చెప్తున్నారని.. NPR, NRC ల పై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మజ్లీస్ పార్టీ తీరంగా ర్యాలీ తీస్తే కాంగ్రెస్, బీజేపీలు పరేషాన్ అయ్యాయని చెప్పారు. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని.. ఉత్తరప్రదేశ్ లో 25 మంది ముస్లింలను యోగి ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని చెప్పారు… ఇప్పటికి పోస్టు మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదని అన్నారు.

ఇవికూడా చదవండి..

MIM పాకిస్తానీ పార్టీ : ఎంపీ అర్వింద్

మజ్లిస్​కు 6 మున్సిపాలిటీలు!…TRS​తో MIM అండర్​స్టాండింగ్

లెఫ్ట్ పార్టీల అబద్ధాల ప్రచారం

హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నరు

టెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు

Latest Updates