ప్లాస్మా దానానికి 32 మంది రెడీ: ప్రభుత్వానికి ఎంపీ అసదుద్దీన్ లేఖ

హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు తమ ప్లాస్మా దానం చేసేందుకు రెడీ గా ఉన్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు. ప్రస్తుతం వైరస్ బారిన పడి పోరాడుతున్న పేషెంట్లకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని, కోరోనా బారిన పడి కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ లకు లేఖ రాశారు. వారి పేర్లు, వివరాలు ప్రభుత్వానికి అందజేస్తున్నానని పేర్కొన్నారు.
దేశంలో వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగి సభ్యులు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న రెండు వందల మందికి పైగా సభ్యులు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకువచ్చారు. ప్లాస్మా థెరఫీ ద్వారా వారు కోలుకున్న మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తబ్లిగి చీఫ్ సైతం కరోనా నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.

MP, Asaduddin, letter, Telangana Govt, to donate, plasma, 32 ready, corona effect, corona virus

Latest Updates