కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్.. స్టేషన్‌లో స్వచ్ఛభారత్

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి మద్దతుగా నిరసన తెలిపిన పాల్గొన్న కరీంనగర్ ఎంపీ ఈ ఉదయం అరెస్టయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను విడుదల చేశారు.

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నాయకులు ర్యాలీగా వచ్చి.. కరీంనగర్ బస్టాండ్ దగ్గర ధర్నాకు దిగారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగడంతో.. పోలీసులు ఎంపీ బండి సంజయ్ సహా.. నాయకులను అరెస్ట్ చేసి.. వాహనంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకెళ్లారు.

ఎంపీ సంజయ్ స్వచ్చ భారత్

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో… బండి సంజయ్ అక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించారు. తనతోపాటు అరెస్టై ట్రైనింగ్ సెంటర్ కు వచ్చిన వాళ్లు కూడా… అక్కడి చెత్తను, ప్లాస్టిక్ ను ఎంపీతో కలిసి ఏరేశారు.

Latest Updates