మేం గెలిస్తే హుజూర్ నగర్ పేరు మారుస్తాం: బండి సంజయ్

సూర్యాపేట జిల్లా:  తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్ నగర్ ను పేరు మార్చి పాత పేరు పోంచర్లగా మారుస్తామన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మరో వారం రోజుల్లో ఉప ఎన్నిక ఉండడంతో సంజయ్ ఆదివారం హుజూర్ నగర్ లోని మోడల్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్ ప్రజలను కాంగ్రెస్ ,TRS పార్టీల అభ్యర్థులు ఓట్లు అడగాలి అంటే  ముందుగా క్షమాపణ చెప్పాలన్నారు. అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు హుజూర్ నగర్ లో దోపిడీ జరిగిందన్నారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు కొమ్ము కాసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, TRS పార్టీ రెండు కూడా కమీషన్ల కోసం పేదల ఇండ్ల నిర్మాణం మార్చేసిందని అన్నారు ఎంపీ.

MP Bandi sanjay comments at Huzurnagar by election campaign

Latest Updates