ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పోవాలి.. టీఆర్ఎస్ పోవాలంటే బీజేపీ రావాలి

ఉప్పల్: జీహెచ్‌‌ఎంసీ ఎన్నికలు దేశభక్తులు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉప్పల్‌‌లోని చిలకా నగర్‌‌లో బీజేపీ నిర్వహించిన రోడ్‌‌ షోలో సంజయ్ పాల్గొన్నారు. ఈ రోడ్‌‌షోలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌‌‌తోపాటు స్థానిక బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. భాగ్యలక్మి అమ్మవారి గుడికి రమ్మంటే కేసీఆర్ తోక ముడిచి ఫామ్‌‌హౌస్‌‌లో పడుకున్నాడని విమర్శించారు.

‘ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే విజయోత్సవ సభను భాగ్యనగర్ అమ్మవారి గుడి వద్ద జరుపుకుందాం. ఈసారి జరగబోయేది ఎన్నికలు కాదు.. యుద్ధం. ఇది దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధం. భాగ్యనగర్‌‌ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించబోతున్నాం. అవును, మాది హిందూ ధర్మమే. దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువుల తరఫున మేం నిలబడతాం. ఆ ధర్మం కోసమే బీజేపీ యుద్ధం చేస్తోంది. హిందూ ధర్మాన్ని అవమానపరిస్తే అస్సలు ఊరుకోబోం. రోహింగ్యాలు లేని హైదరాబాద్ కావాలి. దేశద్రోహులకు ఇక్కడ స్థానం లేదు. హైదరాబాద్‌‌ను మినీ పాకిస్థాన్, మినీ బంగ్లాదేశ్ కానివ్వబోం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Latest Updates