ఇంకెన్నిగుండెలు ఆగితే సర్కారు చలిస్తుంది: బండి సంజయ్

సకల జనభేరీలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మరణించడం బాధాకరమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కార్మికుల గుండెలు ఆగుతున్నా సర్కారు కనికరించడం లేదన్నారు. ఇంకెంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఇంకెన్ని గుండెలు ఆగిపోతే సర్కారు చలిస్తుందని ప్రశ్నించారు. డ్రైవర్ బాబు మృతదేహాన్ని కరీంనగర్ బస్ డిపో వద్దకు తరలించకుండా ప్రభుత్వం, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  కనీసం అంతిమ వీడ్కోలును కూడా ప్రభుత్వం జరుపుకోనివ్వదా? ఇది ప్రజాస్వామిక తెలంగాణనా? లేక రజాకార్ల రాజ్యమా ? అని అన్నారు. కార్మికులెవరూ ఆందోళన చెందవద్దన్నారు . ఇవాళ్టి కరీంనగర్ బంద్ కు  బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ బంద్ లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 

Latest Updates