దుబ్బాక లో టీఆర్ఎస్ గెలవడం కేసీఆర్ కి ఇష్టం లేదు

సిద్దిపేట జిల్లా: దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తబాద్ మండలం కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని అన్నారు. దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి, దరిద్రపు ముఖ్యమంత్రి, మూర్ఖ‌త్వపు ముఖ్యమంత్రి కులాలు, వర్గాలతో ప్రజలను విడదీస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను విడదీయడం, చీల్చటం, కొట్లాటలు పెట్టడ‌మే ముఖ్యమంత్రి చేస్తున్న పని అని అన్నారు.

రూ.280 కోట్లు దుబ్బాక నియోజకవర్గానికి ఇచ్చామన్న సంజ‌య్ , అది అబ‌ద్ధ‌మైతే ఉరివేసుకుంటానని సవాలు చేసారు. దుబ్బాకకు చర్చకు రమ్మని అంటే రాలేదని అన్నారు. రేపు చర్చకు సిద్ధం నిరూపించకపోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. మరి కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణాకు విమోచనానికి కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున కనీసం నివాళులు అర్పించలేదని అన్నారు.

దుబ్బాక లో టీఆర్ఎస్ గెలవడం కేసీఆర్ కి ఇష్టం లేదని, అక్క‌డ‌ టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు అడ్డు తొలుగుతుందని, ఓడిన తెల్లారి కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడ‌ని అన్నారు. మొలతాడు లేని ఓవైసీ కి కేసీఆర్ భయపడుతున్నార‌ని, మొలతాడు ఉన్న మేము తలుచుకుంటే ఏమ‌వుతాడ‌ని హెచ్చ‌రించారు.

Latest Updates