మీ సెక్యూరిటీ నాకొద్దు: బండి సంజయ్​

డీజీపీకి లెటర్ ​రాసిన ఎంపీ

కరీంనగర్, వెలుగు: తన సెక్యూరిటీ విషయంలో కరీంనగర్​ సీపీ బాధ్యత లేకుండా వ్యవహరించారని ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. దీనికి నిరసనగా తన భద్రత సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్​ చేస్తున్నట్లు డీజీపీకి లెటర్​రాశారు. ఈ నెల 18న ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు తనపై రాళ్ల దాడి చేశారని, సీపీ మాత్రం దాడి జరగలేదంటూ తప్పుడు ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎంపీ బండి సంజయ్ తనతో ఉన్న వ్యక్తిగత భద్రతా సిబ్బందిని, అదనంగా ఉన్న సిబ్బందిని కూడా వాపస్ పంపిస్తున్నట్లు తెలిపారు. 25వ డివిజన్ లో బీజేపీ నాయకుడు చాడ ఆనంద్ పై దాడి జరగడంతో సివిల్ ఆసుపత్రిలో అతడిని పరామర్శించేందుకు గురువారం స్కూటీ మీద ఎలాంటి భద్రత లేకుండానే వచ్చారు. కరీంనగర్​లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని సీపీ అన్నారని, ఇకపై తాను బైక్​పైనే తిరుగుతానని తెలిపారు.

MP Bandi Sanjay writes a letter to the DGP about his security

Latest Updates