మాజీ సీఎం చౌహాన్ కు ఐ డ్రాప్స్ : కాంగ్రెస్ నిరసన

మధ్యప్రదేశ్ లో రాజకీయం ఆసక్తిగా నడుస్తోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు… బీజేపీ పాలనపై విమర్శలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం…. రైతులకు రుణమాఫీ చేయలేదనీ.., రాష్ట్రంలో ఇతర పథకాలు అమలు కావడం లేదని.. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విమర్శలు చేశారు. దీనికి భోపాల్ కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ కు కంటిచూపు మందగించిందని.. ఆయన చాలా నీరసించి పోయారని విమర్శించారు అధికార కాంగ్రెస్ నేతలు. రుణమాఫీ అయినా.. అభివృద్ధి జరిగినా… అన్నీ మరిచిపోయి.. అబద్దాలు చెబుతున్నారని అన్నారు. చౌహాన్ కు కంటి చూపు మెరుగయ్యేందుకు ఐ డ్రాప్స్ పంపిస్తున్నామన్నారు. జ్ఞాపక శక్తి పెరిగేందుకు చవన్ ప్రాశ్, ఆల్మండ్స్ పంపుతున్నాం.. ఇవి వాడి ఆరోగ్యం బాగుచేసుకోండి అంటూ చురకలు వేశారు.

Latest Updates