పోలీసుల తీరుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం

పోలీసుల తీరుపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులు వెూహరించడంతో బయటకు వచ్చిన ఆయన పోలీసులపై ఫైర్ అయ్యారు. దీంతో వారు దూరంగా జరిగారు. ఈ సందర్భంగా ఎంపీ ఏసీపీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. తన ఇంటి ముందు పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ఛలో ప్రగతి భవన్‌ ముట్టడికి బీజేపీ పిలుపు ఇవ్వడంతో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నామని చెప్పడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపు ఇవ్వలేదని అన్నారు. అసలు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నారా ఫాంహౌస్‌లో ఉన్నారా అని అర్వింద్ ప్రశ్నించారు.

Latest Updates