రైతులు తిరగబడితే సీఎం కేసీఆర్ ఖేల్ ఖతం

రైతన్నలు పండించిన పంట కొనుగోళ్లలో 5 నుంచి 8 శాతం తరుగు తీస్తూ రైస్ మిల్లర్లు దోపిడి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు.  రైస్ మిల్లర్ల ఓనర్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని అన్నారు. కరోనా సాకుతో భారీగా సొమ్ము చేసుకుంటున్న సీఎం కేసీఆర్ పై రైతులు తిరగబడితే ఖేల్ ఖతం అంటూ మండిపడ్డారు.

ధాన్యం సేకరణలో భాగంగా ప్రస్తుతం హమాలీలు లేరని, గన్నీ బ్యాగుల కొరత ఉందని అంటున్నారని ఇప్పటి వరకూ ఆ సమస్య ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.

దాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రవాణా తప్ప.. వడ్ల కొనుగోలు ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ముస్లిం సోదరులకు ఇచ్చే ప్రతి బియ్యపు గింజ, తినే ప్రతి అన్నపు ముద్ద పీఎం నరేంద్రమోడీ ఇచ్చినవే స్పష్టం చేశారు.

కరోనా నివారణ కోసం కేంద్ర రూ.7వేల కోట్లు విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 7వేల కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

1) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 32, 87, 000 రైతులకు  ఒక్కొక్కరికి 2000 చొప్పున  మొత్తంగా 652 కోట్లు నేరుగా  DBT ద్వారా  లబ్ధిదారుల ఖాతాలో జమ  .

2) 52,60,000 మహిళల జనధన్ ఖాతాలలో 3 నెలలకు నెలకి 500 చొప్పున 789 కోట్లు

3) ఉజ్జ్వల పథకం కింద 10,72,000 లబ్దిదారులకు 180 కోట్లు విడుదల.

4) 8,46,000 నమోదైన భవన నిర్మాణ కార్మికులకు 1500 చొప్పున 127 కోట్లు

5) ఒక్కొక్కరికి  1000 రూపాయల చొప్పున వృద్ధాప్య పెన్షన్లు 4,77,398 మంది లబ్దిదారులకు  47.74 కోట్లు, వితంతు పెన్షన్లు  1,80, 201 మంది లబ్దిదారులకు 18.02 కోట్లు, వికలాంగ పెన్షన్లు 23, 357 మంది లబ్దిదారులకు 2.33 కోట్లు మొత్తంగా 6,80,956 లబ్దిదారులకు 68 కోట్లు.

6)మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద  50,20,466 మంది కార్డుదారులకు  ప్రతీ కార్డు దారునికి రోజుకి 20 రూపాయల చొప్పున అదనంగా 100 రోజులకు మొత్తంగా ఒక వ్యక్తికి 2000 చొప్పున, 1004 కోట్లు

7)జాతీయ ఆహార భద్రత పథకం కింద రూ.1.91కోట్ల కార్డు దారులకు ఒక వ్యక్తికి  నెలకు 5 కేజీల చొప్పున బియ్యం మరియు కేజీ పప్పు ఉచితంగా అందిస్తున్నారు. బియ్యానికి 1261.44 కోట్లు  మరియు కేజీ పప్పు కి 262.60 కోట్లు.

8) డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఫండ్ ని కూడా కరోనా వైరస్ నిర్మూలించేందుకు వినియోగం

9) రాష్ట్ర విపత్తు రిలీఫ్ ఫండ్ కింద వలస కార్మికులకు, రేషన్ కార్డు లేని వరికి భోజనం అందించుటకు 599 కోట్లు.

10) 15వ ఆర్ధిక సంఘం నిధుల కింద మొదటి విడతగా 982 కోట్లు అడ్వాన్స్ గా చెల్లింపు.

11)ఇవేగాకుండా కేంద్రం  కోవిడ్ హాస్పిటల్, ఆరోగ్య రక్షణ కొరకు  దేశమంతటికీ కలిపి 15,000 కోట్లు విడుదల చేసింది.

ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అందించినా  కూడా వలస కార్మికులకు భోజనం అందించకపోవడం, వెంటిలేటర్లు అందించమని రాష్ట్ర ప్రభుత్వం కోరడం విడ్డూరమని ఎంపీ అర్వింద్ అన్నారు.

Latest Updates