రాష్ట్రంలో రైతుల పొట్ట కొడుతున్నారు

జగిత్యాల, వెలుగు:  వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర సర్కారు రైతులను మోసం చేస్తోందని నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అర్వింద్  మండిపడ్డారు. కేంద్రమే ఎఫ్ సీఐ ద్వారా ధాన్యం కొంటోందని, కానీ రాష్ట్ర సర్కారు తామే కొంటున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ఊర్లలో టీఆర్ఎస్  నాయకులు తాలు, తప్ప పేరుతో క్వింటాల్ కు 6% నుండి 10% వరకు కోత వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పొట్టగొట్టి బతుకుతున్న కేసీఆర్  వంటి సీఎం ఇండియాలో ఎక్కడా లేరని కామెంట్  చేశారు. సోమవారం అర్వింద్  జగిత్యాల జిల్లా చల్ గల్, పోరండ్ల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరి బాగా పండిందని సీఎం కేసీఆర్ అంటున్నారని.. ఇదేం కొత్త కాదు, కేసీఆర్ లేనప్పుడు ఇంతకన్నా ఎక్కువ పండిందని పేర్కొన్నారు.

కేంద్రం, ఎఫ్ సీఐ కొంటున్నయి

రాష్ట్రమే వడ్లు కొంటున్నట్టుగా టీఆర్ఎస్  సర్కారు మభ్యపెడుతోందని.. వడ్లన్నింటినీ ఎఫ్ సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేస్తోందని అర్వింద్  స్పష్టం చేశారు. ఎఫ్ సీఐ ఎన్ని టన్నులైనా కొనుగోలు చేస్తోందని, దానికి పరిమితులేమీ లేవని చెప్పారు. కానీ టీఆర్ఎస్  నాయకులు రైతులు, ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఈ ఒక్క రాష్ట్రంలోనే కొంటున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

రైతులను దోచుకోవడం దారుణం

రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని.. ఇలాంటి టైంలో ట్రాన్స్ పోర్టు తక్కువ ఉందని, హమాలీల కొరత ఉందని సాకులు చెప్తూ రైతుల పొట్టకొట్టడం దారుణమని అర్వింద్  మండిపడ్డారు. పసుపు పంటకు మద్దతు ధరపై కేంద్రానికి ప్రపోజల్ పంపేందుకు కేసీఆర్ కు చేతకావడం లేదని.. పక్క రాష్ట్ర సీఎం జగన్ మాత్రం ఇప్పటికే పంపాడని చెప్పారు. కేంద్రం 30 నుంచి 50 శాతం ఇస్తామన్నా ప్రపోజల్  పంపడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

గల్ఫ్  కార్మికుల డేటా కూడా ఉండదా?

రాష్ట్రం నుంచి గల్ఫ్ కు వలస వెళ్లినవారి డేటా సర్కారు దగ్గర లేకపోవడం దారుణమని అర్వింద్  మండిపడ్డారు.  వలస కూలీలకు భోజనం కోసం కేంద్రం 599 కోట్లు ఇస్తే.. రాష్ట్రంలో కేవలం 500 చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. కరోనా హాస్పిటళ్ల కోసం కేంద్రం ఇచ్చిన ఫండ్  నుంచే ప్రజలకు1,500 చొప్పున ఇస్తున్నారన్నారు. కూలీల ట్రైన్ ఖర్చుల్లో కేంద్రం 85% భరిస్తోందని, రాష్ట్ర సర్కారు 15% పెట్టేందుకు వెనుకాడుతోందని ఆరోపించారు.

ప్రతి గింజా కొంటానన్నారు..ఎక్కడ కొన్నారు?

Latest Updates