టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని ప్రజలు ఫిక్స్ అయ్యారు

దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని ప్రజలు ఫిక్స్ అయ్యారన్నారు. బోరు మోటార్లకు మీటర్లు పెట్టాలని ఏ బిల్లులో ఉందో హరీష్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు అరవింద్. ఇన్నేండ్లు దుబ్బాకను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

ఇతర దేశాల నుంచి పసుపు దిగుమతి ఆగిపోయిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తాను అమిత్ షాతో మాట్లాడిన తర్వాత పసుపు ఇంపోర్ట్స్ బంద్ అయ్యాయన్నారు. దాంతో రాష్ట్రంలో పసుపుకు ధర పెరిగిందన్నారు అరవింద్. మనదగ్గరి నుంచి బంగ్లాదేశ్ కు పసుపు ఎగుమతి అవుతుందని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టంతో.. పసుపు రైతులు కోరుకున్న మద్దతు ధర వస్తుందన్నారు అరవింద్.

 

Latest Updates